MEE TV


MEE TV

స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ, శ్రీనిధి శెట్టి, రాశి ఖన్నా, ఎస్ థమన్, నీరజా కోన, టిజి విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ 'తెలుసు కదా' షూటింగ్ పూర్తి

మిరాయ్ లాంటి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ తర్వాత పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నుంచి వస్తున్న మోస్ట్ ఎవైటెడ్ మ్యూజికల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ 'తెలుసు కదా'. స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి, రాశి ఖన్నా హీరోయిన్స్.

ప్రముఖ స్టైలిస్ట్-ఫిల్మ్ మేకర్ నీరజా కోన దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టిజి విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం తాజాగా షూటింగ్ పూర్తి చేసుకుంది. టీం లోకేషన్ లో కేక్ కట్ చేసుకుని సెలబ్రేట్ చేసుకున్నారు.

ఇటివలే రిలీజ్ చేసిన తెలుసు కదా టీజర్ కు ట్రెంమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఫస్ట్ సాంగ్ మల్లిక గంధ చార్ట్ బస్టర్ హిట్ అయ్యింది. సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

త్వరలో సెకండ్ సాంగ్ రిలీజ్ కానుంది. మేకర్స్ ఈ సినిమాని అగ్రెసివ్ గా ప్రమోట్ చేయబోతున్నారు.

డైరెక్టర్ నీరజకోన చాలా యూనిక్ కాన్సెప్ట్ తో తెరకెక్కించారు. సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. ప్రమోషన్ మెటీరియల్ హ్యుజ్ రెస్పాన్స్ తో సినిమాపై అంచనాలు పెంచింది.

సెన్సేషనల్ కంపోజర్ తమన్ మ్యూజిక్ అందించారు. జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఎడిటర్, సినిమాటోగ్రాఫర్ జ్ఞాన శేఖర్ VS లావిష్ విజువల్స్‌ను అందిస్తుండగా, అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్. కాస్ట్యూమ్స్‌ శీతల్ శర్మ.

తెలుసు కదా అక్టోబర్ 17న గ్రాండ్ గా విడుదల కానుంది.

#TelusuKada #SidduJonnalagadda #SrinidhiShetty #RaashiKhanna #NeerajaKona #SThaman #PeopleMediaFactory #TeluguCinema #TeluguMovies #RomanticEntertainer

1 week ago | [YT] | 13

MEE TV

Rocking Star Manchu Manoj at Dasara Special Aadivaaram Parivaar Show | Celebration Episode

Rocking Star **@HeroManoj1** lit up the stage with his **energetic presence** at the Dasara Special **#AadivaaramParivaar** show

Get ready for unlimited fun, festive vibes, and full-on entertainment as this most-awaited episode is all set to air soon on your favorite channel

Don’t miss this power-packed celebration with **#ManchuManoj** & Team #Mirai

#ManchuManoj #Mirai #AadivaaramParivaar #DasaraSpecial #TeluguShow #FestivalCelebrations #EntertainmentUnlimited

2 weeks ago | [YT] | 16

MEE TV

megastar Chiranjeevi Meets Kirti Chakra Awardee Major Malla Ramgopal Naidu | Honours Gallantry

Megastar **Chiranjeevi Garu** (@KChiruTweets) recently met **Kirti Chakra Awardee Major Malla Ramgopal Naidu**, who was honored in **Aug 2023** for his **extraordinary gallantry**.

Chiru Garu expressed his **delight and gratitude** for the Major’s affection and extended his **warm wishes and blessings** to him and his family.

#MegastarChiranjeevi salutes the spirit of courage and sacrifice 🇮🇳

#MegastarChiranjeevi #Chiranjeevi #KirtiChakra #IndianArmy #Gallantry #MajorMallaRamgopalNaidu #RespectOurHeroes #TeluguCinema

2 weeks ago | [YT] | 19

MEE TV

యూట్యూబ్‌ ఫేం షణ్ముఖ్‌ జస్వంత్‌ 'ప్రేమకు నమస్కారం' టైటిల్‌ గ్లింప్స్‌ విడుదల

కొత్తదనంతో కూడిన చిత్రాలను మన తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారు. అందుకే మన దర్శక, నిర్మాతలు ఇప్పుడు న్యూ కాన్సెప్ట్‌ చిత్రాలను నిర్మించడానికి ఇష్టపడుతున్నారు. ఇక ఇప్పుడు సోషల్‌మీడియాలో, యూట్యూబ్‌లో సన్సేషన్‌ సృష్టించిన వారు వెండితెరకు పరిచయమవుతున్నారు. సక్సెస్‌ సాధిస్తున్నారు. ఇటీవల లిటిల్‌హార్ట్స్‌ చిత్రంతో యూట్యూబ్‌ సన్సేషన్‌, మీమ్‌ కంటెంట్‌ క్రియేటర్‌ మౌళి తనూజ్‌ బ్లాక్‌బస్టర్‌ అందుకున్నాడు. ఇప్పుడు ఈ కోవలోనే యూట్యూబ్‌లో వీడియోలతో తనకంటూ ఓ ప్రత్యేక మార్క్‌ను క్రియేట్‌ చేసుకున్న యూట్యూబ్‌ సన్సేషన్‌ షణ్ముఖ్‌ జస్వంత్‌ హీరోగా ఓ చిత్రం రూపొందుతోంది. ఉల్క గుప్తా హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రముఖ నటుడు శివాజీ, ప్రముఖ నటి భూమిక కీలకపాత్రల్లో కనిపించబోతున్నారు. ఏబీ సినిమాస్‌ పతాకంపై అనిల్‌ కుమార్‌ రవడ, భార్గవ్‌ మన్నె నిర్మిస్తున్న ఈ చిత్రానికి వి. భీమ శంకర్‌ దర్శకుడు. మంగళవారం హీరో షణ్ముఖ్‌ జస్వంత్‌ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రానికి 'ప్రేమకు నమస్కారం' అనే టైటిల్‌ని నిర్ణయించారని తెలియజేయడంతో పాటు ఇందుకు సంబంధించిన టైటిల్‌ గ్లింప్స్‌ వీడియోను విడుదల చేశారు మేకర్స్‌.

ఈ గ్లింప్స్‌ వీడియోను గమనిస్తే.. ఇదొక యూత్‌ఫుల్‌ లవ్ ఎంటర్‌టైనర్‌లా కనిపిస్తుంది. లవ్‌ ఫెయిల్యూర్స్‌.. లవ్‌ బ్రేకప్‌ అయిన వాళ్లంతా ఒక దగ్గర చేరి మాట్లాడుకుంటున్న సంభాషణలు, వాళ్ల గర్లఫ్రెండ్స్‌ తమకు ఎలా హ్యాండ్‌ ఇచ్చారు అని చెప్పుకునే ఫన్నీ బాధలు అన్ని ఎంతో ఎంటర్‌టైనింగ్‌గా ఉన్నాయి. ఇక ఫైనల్‌గా ఫణ్ముఖ్‌ ఇది పాన్‌ ఇండియా ప్రేమ ప్రాబ్లమ్‌ అని చెప్పడం, మీరు అమ్మాయి దక్కలేదని మందుకు, సిగరెట్లకు ఖర్చు పెట్టే డబ్బులతో కైలాసగరి దగ్గర ల్యాండ్‌తో పాటు కారు కొనుక్కోవచ్చు అని చెప్పే సంభాషణలు నేటి యూత్‌కు, వాళ్ల ప్రేమకు ఎంతో కనెక్ట్‌ అవుతాయి.టోటల్‌గా ప్రేమకు నమస్కారం అనే టైటిల్‌ అనౌన్స్‌మెంట్‌ వీడియో ఎంతో ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ 'ఇదొక యూత్‌ఫుల్‌ లవ్‌ ఎంటర్‌టైనర్‌. ఈ చిత్రంలో యూత్‌తో పాటు అందరికి కనెక్ట్‌ అయ్యే అంశాలున్నాయి. ముఖ్యంగా నేటి యువత లవ్‌, బ్రేకప్‌అప్‌, ఇలా అన్ని అంశాలను పూర్తి వినోదభరితంగా ఈ చిత్రంలో చూపించబోతున్నాం. నేటి యువత బాగా కనెక్ట్‌ అయ్యే కథ ఇది' అన్నారు. నిర్మాత మాట్లాడుతూ '' వైవిధ్యమైన కాన్సెప్ట్‌తో రాబోతున్న చిత్రమిది. కొత్తదనం, హిలేరియస్‌ ఎంటర్‌టైనర్‌మెంట్‌ ఈ చిత్రంలోని ప్రత్యేకతలు. తప్పకుండా చిత్రం మీ ఆదరణ పొందుతుంది' అన్నారు.

షణ్ముఖ్‌ జస్వంత్‌, శివాజీ, భూమిక, ఉల్కగుప్తా, బ్రహ్మాజీ, శ్రీకాంత్‌ అయ్యంగార్‌, అరుణ్‌ అదిత్‌, రంగస్థలం మహేష్‌, మణిచందన, కమల్‌, క్రాంతి, నీల రమణ, శోభన్‌, సుభాష్, కొటేశ్వరరావు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి డీవోపీ కిషోర్‌ బోయిడపు, సంగీతం: గ్యానీ, ఎడిటర్‌: కేసీబీ హరి, లిరిక్స్‌: సరస్వతి పుత్రి రామజోగయ్య శాస్త్రి, దినేష్‌ కాకెర్ల, ఆర్ట్‌: రవికుమార్, కొరియోగ్రఫీ: శ్రావణ్‌, విశాల్‌, ప్రొడక్షన్‌: రమేష్‌ వర్మ, నిర్మాతలు: అనిల్‌ కుమార్‌ రవడ, భార్గవ్‌ మన్నె రచన-దర్శకత్వం: భీమ శంకర్‌.

#PremakuNamaskaram #ShanmukhJaswanth #UlkaGupta #BhumiKa #Shivaji #TeluguCinema #LoveEntertainer #TeluguMovies2025 #BheemaShankar #ABcinemas

2 weeks ago | [YT] | 16

MEE TV

Priyanka Arul Mohan as *Kanmani* joins Telugu Indian Idol S4 | OG Idol Party Special

All eyes on our **OG Kanmani** Actress **Priyanka Arul Mohan** joins the **Telugu Indian Idol Season 4** stage for a special *OG Idol Party* celebration

Don’t miss the musical extravaganza & fun-filled moments on **September 19 & 20**, streaming only on **aha Video**.

Catch Priyanka’s charm, melodies, and a glimpse of the much-awaited **Power Star Pawan Kalyan’s OG** vibe on the Idol stage!

Priyanka Arul Mohan, OG Kanmani, OG Movie, OG Idol Party, Telugu Indian Idol S4, Telugu Indian Idol 2025, Priyanka Arul Mohan OG, OG Priyanka Stage, OG Telugu Updates, aha Telugu Shows, OG Pre Release, Pawan Kalyan OG, Priyanka Arul Mohan Performance

#OG #Kanmani #PriyankaArulMohan #OGIdolParty #TeluguIndianIdolS4 #aha #PawanKalyan #Tollywood

2 weeks ago | [YT] | 6

MEE TV

'ఓజీ' సినిమాలో నేను పోషించిన 'కణ్మని' పాత్రకి నా మనసులో ఎప్పటికీ ప్రత్యేక స్థానముంటుంది: కథానాయిక ప్రియాంక అరుళ్ మోహన్

'ఓజీ' సినిమాలో యాక్షన్ మాత్రమే కాదు.. బలమైన కథ, ఫ్యామిలీ డ్రామా కూడా ఉంటాయి: కథానాయిక ప్రియాంక అరుళ్ మోహన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులంతా ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం 'ఓజీ'. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై డీవీవీ దానయ్య, కళ్యాణ్ దాసరి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి సుజీత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఓజాస్‌ గంభీరగా పవన్ కళ్యాణ్ శక్తివంతమైన పాత్రలో కనిపించనున్న ఈ చిత్రంలో ప్రియాంక అరుళ్ మోహన్ కథానాయికగా నటిస్తున్నారు. సెప్టెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల కానున్న 'ఓజీ' చిత్రంపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, పాటలు విశేషంగా ఆకట్టుకున్నాయి. త్వరలో ట్రైలర్ విడుదల కానుంది. విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో చిత్ర బృందం ప్రచార కార్యక్రమాల్లో జోరు పెంచింది. ఈ నేపథ్యంలో తాజాగా కథానాయిక ప్రియాంక అరుళ్ మోహన్ పాత్రికేయులతో ముచ్చటించి చిత్రానికి సంబంధించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

పవన్ కళ్యాణ్ గారితో ఓజీ ప్రయాణం గురించి చెప్పండి?
ఓజీతో దాదాపు రెండున్నరేళ్ల ప్రయాణం నాది. ఈ ప్రయాణాన్ని ఎప్పటికీ మరిచిపోలేను. పవన్ కళ్యాణ్ గారితో కలిసి నటించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను. ఓజీ సినిమాలో కణ్మని పాత్ర చేయడం మరింత అదృష్టంగా భావిస్తున్నాను. ఇప్పటిదాకా నేను చేసిన పాత్రల్లో కణ్మని నాకు చాలా ఇష్టమైన పాత్ర. ఈ పాత్రకి నా మనసులో ఎప్పటికీ ప్రత్యేక స్థానముంటుంది. పవన్ కళ్యాణ్ గారితో పని చేయడం అనేది ప్రతిరోజూ అదృష్టమే. ఆయన నుంచి ఎన్నో నేర్చుకున్నాను. పవన్ కళ్యాణ్ గారు జెంటిల్ మేన్. అందరినీ సమానంగా చూస్తారు. ఆన్ స్క్రీన్ లో మరియు ఆఫ్ స్క్రీన్ లో ఆయన రియల్ హీరో.

ఈ ప్రాజెక్ట్ లోకి మీరు ఎలా వచ్చారు?
మూవీ అనౌన్స్ మెంట్ అయిన తర్వాత డైరెక్టర్ గారు నాకు ఈ కథ వినిపించారు. కథ నాకు చాలా నచ్చింది. వెంటనే ఈ సినిమా చేయడానికి అంగీకరించాను. నేను పోషించిన కణ్మని పాత్ర చాలా నచ్చింది. పైగా, పవన్ కళ్యాణ్ గారి సినిమా. సుజీత్ గారు డైరెక్టర్, డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మాణం. ఇంతకంటే ఏం కావాలి ఈ సినిమా ఒప్పుకోవడానికి.

కణ్మని పాత్ర ఎలా ఉండబోతుంది?
ఇది 1980-90లలో జరిగే కథ. పాత్రను మలిచిన తీరు కానీ, ఆహార్యం కానీ అప్పటికి తగ్గట్టుగానే ఉంటుంది. కణ్మని ఒక ఇన్నోసెంట్ స్వీట్ గర్ల్. గంభీర పాత్రతో గాఢమైన ప్రేమలో ఉంటుంది. గంభీర జీవితాన్ని మలుపు తిప్పే పాత్ర కణ్మని.

సువ్వి సువ్వి పాటకు ఈ స్థాయి స్పందన వస్తుందని ముందే ఊహించారా?
తమన్ గారితో మొదటిసారి పని చేశాను. ప్రతి పాటకి వైవిధ్యమైన సంగీతం అందించారు. ఇందులో ఆయన స్వరపరిచిన మొదటి పాట 'సువ్వి సువ్వి'నే. ఈ పాటను అందరికీ వినిపించాలని ఎంతగానో ఎదురుచూశాను. విడుదల తర్వాత అందరికీ సాంగ్ నచ్చడం ఎంతో ఆనందాన్ని ఇచ్చింది.

పవన్ కళ్యాణ్ గారి క్రేజ్ గురించి మీకు ముందే తెలుసా..?
పవన్ కళ్యాణ్ గారి క్రేజ్ అనేది అవధులు లేనిది. నేను బెంగళూరులో ఉన్నప్పుడే ఆయన క్రేజ్ గురించి తెలుసు. అయితే ఆయనతో కలిసి నటిస్తున్నప్పుడు తెలిసిందే ఏంటంటే.. నేను ఊహించిన దానికంటే ఇంకా ఎక్కువ క్రేజ్ ఉంది. ఎంత క్రేజ్ ఉన్నా కూడా.. పవన్ గారు ఒదిగే ఉంటారు. డౌన్ టు ఎర్త్ పర్సన్. చాలా సింపుల్ గా ఉంటారు.

సెట్ లో పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడేవారు?
ఎక్కువగా పుస్తకాల గురించి మాట్లాడతారు. ఆయన చదివిన కథలు, నవలల గురించి చెప్తారు. చరిత్ర గురించి మాట్లాడతారు. అప్పుడప్పుడు సినిమాలు, రాజకీయాల గురించి కూడా మాట్లాడుతుంటారు. ముఖ్యంగా ప్రజల గురించి ఎక్కువ మాట్లాడతారు.

షూటింగ్ సమయంలో పవన్ కళ్యాణ్ గారు ఏమైనా సూచనలు ఇస్తుంటారా?
సన్నివేశం షూట్ చేయడానికి ముందు దర్శకుడు, నటీనటులతో పవన్ కళ్యాణ్ గారు చర్చిస్తారు. సినిమాకి ఉపయోగపడే పలు గొప్ప సూచనలు ఇస్తుంటారు. నటుడిగా కూడా ఆయన తన పాత్రను చాలా సులభంగా చేస్తుంటారు. పవన్ గారి నుంచి చాలా విషయాలు నేర్చుకోవచ్చు.

మీరు సినిమా చూశారా?
ఇంకా చూడలేదు. కొన్ని సన్నివేశాలు చూశాను. విజువల్ గా చాలా బాగున్నాయి.

ఇది యాక్షన్ సినిమా కదా.. ఫ్యామిలీ డ్రామా ఉంటుందా?
ఖచ్చితంగా ఉంటుంది. ఇందులో యాక్షన్ అనేది ఒక భాగం మాత్రమే. బలమైన కథ ఉంది. ఫ్యామిలీ డ్రామా కూడా ఉంది.

డిప్యూటీ సీఎం అయిన తర్వాత పవన్ గారు సెట్ లో ఎలా ఉన్నారు?
ఇప్పుడు ఆయన చాలా ప్రశాంతంగా, మరింత బాధ్యతగా కనిపిస్తున్నారు. ఎక్కువగా ప్రజల గురించి ఆలోచిస్తారు. ప్రస్తుతం యువత ఎలా ఉన్నారు? రాజకీయాలు ఎలా ఉన్నాయి? వంటి విషయాలు చర్చిస్తుంటారు. డిప్యూటీ సీఎం అంటే చిన్న విషయం కాదు కదా. ఆయన తన బాధ్యతను గొప్పగా నిర్వహిస్తున్నారు.

దర్శకుడు సుజీత్ గారి గురించి?
సీన్ ఎలా తీయాలి, నటీనటుల నుంచి ఎలాంటి నటన రాబట్టుకోవాలి.. ఇలా ప్రతి విషయంపై ఆయనకు స్పష్టత ఉంది. నా క్యారెక్టర్, లుక్ బాగున్నాయంటే దానికి కారణం సుజీత్ గారే.

డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ గురించి?
నాకు హోమ్ ప్రొడక్షన్ లాగా అయిపోయింది. డీవీవీ బ్యానర్ లో వరుసగా రెండు సినిమాలు చేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నారు. నిజానికి నేను మొదట ఓజీ సినిమానే అంగీకరించాను. కానీ, సరిపోదా శనివారం చిత్రం ముందు విడుదలైంది. నిర్మాతలు దానయ్య గారు, కళ్యాణ్ గారు చాలా మంచి మనుషులు. వాళ్లంటే నాకు అపారమైన గౌరవం.

తదుపరి ప్రాజెక్ట్ లు?
తెలుగులో కొన్ని కథలు వింటున్నాను. అలాగే, వేరే భాషల్లో పలు సినిమాలు చేస్తున్నాను.

#OG #PriyankaArulMohan #PawanKalyan #Kanmani #OGMovie #PowerStar #Tollywood #DVVEntertainments #Sujeeth #Thaman

2 weeks ago | [YT] | 5