Haii..👋👋 Friends 😊👩❤️💋👨👪
Welcome to my channel Telugu short news 🤗
I started this channel with passion which contain.
different things like ...Latest news and breaking updates from Politics, Short News, Viral posts, viral videos Useful tips,
Please Subscribe My Channel 😊
Support Me 🙏 Friends 🤝 #telugushortnews
Thank you for your support!
News Basket
మాజీ ముఖ్యమంత్రి ని పరామర్శించిన CM రేవంత్ రెడ్డి #revanthreddy #kcr #kcrhipsurgery
2 years ago | [YT] | 2
View 0 replies
News Basket
*కాల మహిమ ఎలా ఉంటుందంటే, కాలం కలిసి రాకపోతే తాడు కూడా పామై కరుస్తుంది అనడానికి - కొన్ని ఉదాహరణలు.*
1. మహానటుడు, ఆంధ్ర ప్రజలు గర్వించే ఎన్టీఆర్ మీద, వైస్రాయ్ సాక్షిగా చెప్పులు పడ్డాయి. ఎన్టీఆర్ చివరి రోజుల్లో ఎంత దారుణ పరిస్థితిలో పడ్డారో చూసాం. పిల్లలు పట్టించుకోలేదు. ఆస్తులు కలసి రాలేదు.
2. 2009 ఎలక్షన్ ప్రచారంలో మెగాస్టార్ చిరంజీవి మీద కోడిగుడ్లతో దాడి చేశారు. ఆ తరవాత రాజకీలయాల నుంచి నిష్క్రమణ.
3. మహా మేధావి, మాజీ ప్రధాని పీవీ నరసింహారావు 420 cases లో బోనులో నిలబడవలసి వచ్చింది. చివరికి శవానికి దహన సంస్కారాలు కూడా సరిగా జరగలేదు.
4. మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి, అంత్యక్రియలు చేయడానికి - కనీసం శవం కూడా దొరకలేదు.
5. ఇప్పటి ముఖ్యమంత్రి, జగన్మోహన్ రెడ్డి - 16 నెలలు జైలులో ఉన్నారు.
6. 1978 లో మాజీ ప్రధాన మంత్రి ఇందిరా గాంధీని, కంటెంట్ ఆఫ్ హౌస్ కింద - సాక్షాత్తు మన పార్లమెంటే జైలుకు పంపింది.
7. తమిళ ప్రజలతో *అమ్మ* అని పిలిపించుకున్న తిరుగులేని ఉక్కుమహిళ, మాజీ ముఖ్యమంత్రి జయలలిత - అసెంబ్లీ సాక్షిగా చీర లాగి వివస్త్రను చేశారు. టాన్సి కేస్ లో కోర్టుల చుట్టూ తిరిగింది. చివరికి ఏ స్థితి లో చనిపోయిందో చూసాం.
8. ఆంధ్ర బిల్ గేట్స్ గా పేరుపొందిన సత్యం రామలింగరాజు, నాలుగు సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించాడు.
9. ప్రపంచాన్ని గడగడలాడించిన అలెగ్జాండర్, చివరకు నిస్సహాయంగా చనిపోయాడు.
10. జాత్యహంకారానికి మారుపేరుగా నిలిచి, లక్షల మందిని ఊచకోత కోయించి, రెండో ప్రపంచ యుద్ధానికి కారణమైన హిట్లర్ దిక్కులేని పరిస్థితుల్లో - ఆత్మహత్య చేసుకున్నాడు.
11. గొప్ప విజన్ ఉన్న నాయకుడు గా చెప్పుకునే మాజీ ముఖ్యమంత్రి, చంద్రబాబు నాయుడు అపాయింట్మెంట్ కోసం - గుమ్మం బయట చేతులు కట్టుకుని వేచి చూసిన కేసీఆర్, ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి.
అలాగే NDA అధికారంలో ఉన్నప్పుడు, NDA కన్వీనర్ చంద్రబాబు నాయుడు అపాయింట్మెంట్ కోసం ప్రయత్నం చేసి - విఫలమైన నరేంద్ర మోడీ, దేశ ప్రధాని అయ్యాడు.
ఒకప్పుడు చంద్రబాబు అపాయింట్మెంట్ కోసం వేచి చూసిన నరేంద్ర మోడీ, కెసిఆర్ లు 15 సంవత్సరాల తర్వాత PM, CM అవడం…. చంద్రబాబుకి 2019 ఎలక్షన్స్ లో చరమగీతం పాడడం కాలమహిమ కాక మరి ఏమిటి! ఇప్పుడు అదే చంద్రబాబు భోరున ఏడ్చిన సంఘటన చూస్తున్నాం.
ఇలా చెప్పుకుంటూ పోతే - చరిత్రలో ఇలాంటి ఉదాహరణలు కోకొల్లలు.
*అందువల్ల "నేనే" అన్న అహంకారంతో విర్రవీగవలసిన అవసరం లేదు.*
*నేనే గొప్ప, నా వల్లనే అంతా జరుగుతుంది - నా సంఘమే గొప్ప, నా పార్టీ నే గొప్ప, మా నాయకుడే గొప్ప, మాదే అంతా - అనే వ్యక్తి అహంకార విధానం అవసరం లేదు.*
ఈ నేనే అన్న - ఈ భూమికి మనం *అరువు* గా వచ్చాం. కొన్నాళ్లకు ఈ భూమికే *ఎరువు* గా మారిపోతాం.
ఈ మధ్యలో *పరువు* గా బతికేద్దాం.
ఎవరు ఎప్పుడు ఎలా మారుతారో చెప్పలేం.
*కాలం* కంటే *వేగంగా* మనసులు మారే *మనషుల* మద్య మనం *బ్రతుకుతున్నాం.*
అందుకే ఎవరితో ఎంతవరకూ *ఉండాలో* అంతవరకే ఉండాలి మనం.
జీవితంలో అన్నీ *కోల్పోయినా* ఒకటి మాత్రం మనకోసం ఎప్పుడూ *సిద్దంగా* ఉంటుంది.
దాని పేరే *భవిష్యత్తు.*
మనిషి జీవితం *మేడిపండు* లాంటిది మేడిపండు పైకి అందంగా కనిపిస్తుంది కానీ, లోపల అన్ని *పురుగులే* ఉంటాయి. *మనిషి జీవితం కూడా అంతే.*
ఒకరి జీవితం మరోకరికి *అందంగానే* కనబడుతుంది.
కానీ ఆ జీవితంలో దాగి ఉన్న *కష్టాలు కన్నీళ్ళు* ఎవరికీ కనిపించవు.
మనం మనిషిగా పుట్టడమే ఒక *అద్భుతం.*
బతికి ఉండటం ఒక *అదృష్టం.*
ముడి పడుతున్న *బంధాలన్ని* వరాలు.
ఎదురు పడుతున్న అడ్డంకులన్ని, మనకు విలువైన *పాఠాలు.*
కష్టం గురించి *చింతించక* ఉన్నన్నాళ్లు *ఆనందంగా* గడిపేద్దాం.😊
అహంకారాన్ని దాటాలంటే ప్రతి మనిషి కొంత ఫిలాసఫీని అర్థం చేసుకోవడం అవసరం.🤘🏼
మీ శ్రేయోభిలాషి... ✍️
2 years ago | [YT] | 0
View 0 replies
News Basket
అక్కా తమ్ముళ్ళ, అన్నా చెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక రక్షాబంధన్ వేడుక.
సోదర సోదరీమణులు అందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు...!!
2 years ago | [YT] | 2
View 0 replies
News Basket
మెగాస్టార్ చిరంజీవికి కాన్సర్
నేను కాన్సర్ బారిన పడ్డాను:
కాన్సర్ వచ్చిందని చెప్పడానికి భయపడలేదు
ముందుగా గుర్తించి చికిత్స తీసుకొని బయటపడ్డా: చిరంజీవి
https://youtu.be/d15pIHRsj2c
#bigbreaking #megafamily #chiranjeevi #cancer #newsupdatetoday #news #filmnews
2 years ago | [YT] | 0
View 0 replies
News Basket
Since morning .. you tube server problem issue is going on
2 years ago | [YT] | 0
View 0 replies
News Basket
మార్కులే జీవితం కాదు!
పరీక్షల్లో తప్పితే క్షణికావేశం పనికిరాదు. ఒక్క విద్యా సంవత్సరం వృథా అయితే మీ జీవితం అంతటితో ఆగిపోదు. మళ్లీ పాస్ కావడానికి అవకాశాలుంటాయి. లేకుంటే మరెన్నో ప్రత్యామ్నాయ మార్గాలుంటాయి. ఎదురొడ్డితేనే జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరతామనే విషయం విద్యార్థులు మరిచిపోవద్దు. పరీక్షల్లో తప్పామని బలవన్మరణాలకు పాల్పడి మీ తల్లిదండ్రులకు తీరని వేదనను మిగల్చకండి #students #suicides
2 years ago | [YT] | 1
View 0 replies
News Basket
అసలు మణిపూర్ లో ఏం జరుగుతుంది #manipur
చైనా, బర్మా, పాకిస్థాన్… మణిపూర్ మంటలకు తలాపాపం తిలా పిడికెడు…
ఉత్తర ఈశాన్య రాష్ట్రం అయిన మణిపూర్ మండుతున్నది ! ఏదో మాట వరసకి మండుతున్నది అనే పదం వాడడం లేదు ! నిజంగానె మండుతున్నది ! May 3 న మొదలయిన ఘర్షణలు ఈ రోజుకి తీవ్ర రూపం దాల్చి చివరకి కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులు ఇవ్వాల్సిన స్థితిలోకి వెళ్ళిపోయింది మణిపూర్ రాష్ట్రం. మణిపూర్ లో ఉంటున్న కుకీ,నాగా, మెతీ తెగల ప్రజల మధ్య తీవ్ర ఘర్షణలు జరగడం వల్ల చివరికి కర్ఫ్యూ విధించాల్సిన పరిస్థితి ఏర్పడింది అక్కడ. గత నాలుగు రోజుల నుండి ఇంటర్నెట్, మొబైల్ సేవలని నిలిపివేశారు అధికారులు. కానీ ఘర్షణలు ఆగలేదు సరికదా ఇంకా పెరిగిపోయాయి.
మణిపూర్ లో జాతుల మధ్య వైరం ఎందుకు వచ్చింది ?
1. మణిపూర్ లో ముఖ్యంగా మూడు తెగల ప్రజలు ఉన్నారు. కుకీ తెగ, నాగా తెగ, మెతీ [Meitie ] తెగ ప్రజలు ఉంటున్నారు. అఫ్కోర్స్ 4వ తెగ అయిన కుకీ ఫంగల్ కూడా అక్కడ ఉంది.
2. కుకీ, నాగా తెగల ప్రజలు షెడ్యూల్ ట్రైబ్ [ST] కింద రక్షణ పొందుతున్నారు. వీళ్ళు అందరూ క్రైస్తవులు.
3. మెజారిటీ తెగ ప్రజలు అయిన మెతీ ప్రజలు హిందువులు. వీళ్ళు మణిపూర్ లో గత 2 వేల సంవత్సరాలకి పైబడి ఉంటున్నారు.
4. ఇక మెతీ తెగ ప్రజలలో మతం మార్చబడ్డ ప్రజలని మెతీ పంగల్ లు అంటారు వీళ్ళు ముస్లిమ్స్.
5. మణిపూర్ రాష్ట్ర భౌగోళిక స్వరూపం ఎలా ఉంటుంది అంటే 22,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంగా ఉంది. ఇందులో 10% లోయ ప్రాంతం [Valley] గా ఉండి ఒక మైదానంలాగా చదునుగా ఉంటుంది. మిగతా 90% ప్రాంతం మొత్తం ఎత్తైన పర్వతాలు, కొండలు లోయకి అన్ని దిశలలో వ్యాపించి ఉన్నాయి.
6. ఎత్తైన కొండ ప్రాంతాలలో కుకీ మరియు నాగా జాతి ప్రజలు ఉంటున్నారు. లోయలో ఉండే మైదాన ప్రాంతంలో మెతీ తెగ ప్రజలు ఉంటున్నారు.
7. మనకి స్వాతంత్ర్యం వచ్చాక కుకీ, నాగా ప్రజలని షెడ్యూల్ ట్రైబ్స్ జాబితాలో చేర్చారు. ఈ కుకీ, నాగా ప్రజలు మొత్తం కొండల మీద ఉంటారు.
8. ఈ కొండ ప్రాంతానికి రక్షణగా ఆర్టికల్ 371c రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది. ఆర్టికల్ 371c అనేది దాదాపుగా కాశ్మీర్ కి సంబంధించిన ఆర్టికల్ 370 లోని నిబంధనలకి దగ్గరగా ఉంటాయి! అంటే ఈ కొండ ప్రాంతాలలో బయటి వాళ్ళు ఎవరూ స్థలాలు కొనడానికి వీలు లేదు.
9. ఈ కొండ ప్రాంతంలో ఉండే అడవులలో కుకీలు, నాగాలు ఉండవచ్చు కానీ ఆ స్థలాలని అమ్మడానికి లేదు బయటి వాళ్ళు కొనడానికి లేదు.
10. కానీ అదే లోయలో ఉండే మైదాన ప్రాంతంలో ఎవరయినా స్వేచ్ఛగా స్థలాలు కొనవచ్చు, అక్కడ ఎవరయినా నివాసాలు ఏర్పరుచుకోవచ్చు. వ్యాపారాలు చేసుకోవచ్చు.
సమస్య ఎక్కడ వచ్చింది అంటే ఒకే రాష్ట్రంలో ఉన్న ప్రాంతాలకి వేర్వేరు చట్టాలు, అధికారాలని అమలు చేయడమే ! మణిపూర్ రాష్ట్రంలో కొండ ప్రాంతాల కోసం అంటూ ప్రత్యేకంగా ఒక హిల్ ఏరియా కమిటీ [Hill Area Committee-HAC ] ఏర్పాటు చేశారు. ఈ హిల్ ఏరియా కమిటీ అనేది ఏదో ఆషా మాషీ కమిటీ అనుకుంటే పొరపాటే ! HAC లేదా హిల్ ఏరియా కమిటీ కి ఉన్న అధికారాలు ఏమిటే తెలిస్తే ఆశ్చర్యం వేయక మానదు.
మణిపూర్ రాష్ట్ర బడ్జెట్ శాసన సభ్యుల ఆమోదం పొందితే సరిపోదు ! HAC కి బడ్జెట్ లో పొందుపరిచిన అంశాలు ఏమిటో తెలియచేయాలి. HAC సభ్యులు ఆ బడ్జెట్ లో కొండ ప్రాంతంలో ఉంటున్న కుకీ, నాగా ప్రజలకి వ్యతిరేకంగా ఏమీ లేవనీ.. వాళ్ళ అభివృద్ధికి నిధుల కేటాయింపులో ఎలాంటి వివక్ష లేదని నిర్ధారించుకున్న తరువాత ఆమోదం తెలిపితే అప్పుడు మణిపూర్ రాష్ట్ర బడ్జెట్ కి సంపూర్ణ ఆమోదం లభిస్తుంది. HAC ఆమోదం లేకపోతే ఆ బడ్జెట్ కి విలువ ఉండదు! అలాగే మణిపూర్ లాండ్ రెవిన్యూ మరియు లాండ్ రిఫార్మ్ [MLR & LR] ల మీద HAC కి అధికారం ఉంది.
ఇప్పుడు అసలు సమస్యకి కారణం ఏమిటో చెప్తాను!
షెడ్యూలు కులాలు మరియు షెడ్యూల్ జాతులు కొరకు ఏర్పాటు చేసిన చట్టాలు ఎప్పుడయితే మొదలయ్యాయో అప్పటి నుండి మణిపూర్ లో ఉన్న కుకీ, నాగా ప్రజలకి ST హోదా కల్పించారు. అలాగే కొండ ప్రాంతాలలో ఉండే అడవులలో స్వేచ్చగా తమకి ఇష్టం వచ్చినట్లు బ్రతికే హక్కునీ కల్పించారు. ఇంతవరకు బాగానే ఉన్నా కుకీలు, నాగాలు మతం మారి క్రైస్తవం స్వీకరించాక వీళ్ళకి ST హోదాని ఎందుకు రద్దు చేయలేదు అనే భావన ఇతర వర్గాల్లో పెరిగిపోయింది.
అదే కొండ దిగువ ప్రాంతంలో ఉండే మీతీ ప్రజలని జెనెరల్ కేటగిరీలో ఉంచేశారు ఎందుకు? మేం సనాతన ధర్మాన్ని ఆచరిస్తున్నందుకా? అసలు మణిపూర్ లో మూల వాసులుగా చెప్పబడే మాకు ఎలాంటి ప్రత్యేక హక్కులు ఎందుకు లేకుండా చేశారు ? అనేది మీతీ ప్రశ్న
11. లోయలోని మైదాన ప్రాంతంలో ఉంటున్న మితీ ప్రజల స్థలాలని ఎవరయినా కొనవచ్చు. బయటి వాళ్ళు అక్కడ ఉద్యోగ, వ్యాపారాలు చేయవచ్చు మరియు శాశ్వత నివాసాలు ఏర్పాటు చేసుకోవచ్చు.
12. ప్రస్తుత సమస్యకి కారణం ఏమిటంటే వేల ఏళ్ల నుండి ఉంటున్న మితీ ప్రజలు మొదట్లో మెజారిటీగా ఉంటూ వచ్చినా కాల క్రమేణా మైనారిటీ ల కిందకి వచ్చేస్తున్నారు.
13. బంగ్లాదేశ్, మియాన్మార్ నుండి అక్రమంగా మణిపూర్ లోకి ప్రవేశించి వలస దారులు మీతీ ప్రజల అవకాశాలని కొల్లగొడుతున్నారు.
14. గత పదేళ్లకి పైగా స్థానిక మితీ ప్రజలు మమ్మల్ని కూడా ST కేటగిరీలోకి చేర్చి మాకు రక్షణ కల్పించండీ అంటూ ఆందోళనలు చేస్తూ వచ్చారు కానీ అక్కడి ప్రభుత్వాలు మొద్దు నిద్ర పోయాయి. చివరికి విసుగెత్తి రాష్ట్ర హై కోర్టుకి తమ సమస్యలని విన్నవించుకున్నారు. హై కోర్టు మితీ ప్రజల వాదనలని విన్న తరువాత మితీ ప్రజలని ST కేటగిరీలో చేర్చాల్సిందిగా కోరుతూ తీర్మానం చేసి, కేంద్ర ప్రభుత్వానికి పంపించాల్సినగా ఆదేశాలు ఇచ్చింది మణిపూర్ రాష్ట్ర ప్రభుత్వానికి.
15. దాంతో ఆగ్రహించిన కుకీ, నాగా ప్రజలు మితీ ప్రజల మీద దౌర్జన్యానికి దిగారు.
16. కుకీ ప్రజలు సహజంగా వాడే కత్తులతో మరియు నాగా ప్రజలు AK-47 లతో విరుచుకు పడ్డారు.
17. అయితే కుకీ, నాగా ప్రజల ఆగ్రహానికి మరో ముఖ్య కారణం ఉంది: దశాబ్దాలుగా కుకీ, నాగా ప్రజలు కొండల మీద అడవులలో గంజాయి సాగు చేస్తూ వస్తున్నారు. గంజాయి పంట చేతికి వచ్చాక గంజాయిని ప్రాసెస్ చేసి అమ్ముకుంటున్నారు.
18. మణిపూర్ అటవీ, రెవెన్యూ, పోలీసు అధికారులు ఇటీవలే దాడులు చేసి గంజాయి పంటని తగులపెట్టారు.
19. మరోవైపు కుకీ, నాగా ప్రజలు గంజాయిని పండించడం తమ జన్మ హక్కుగా భావిస్తూ అధికారుల మీద తిరగబడుతున్నారు తరుచూ! అసలు అడవులు తమవే అని వాదిస్తున్నారు కానీ అడవులలో ఉండడం వరకే వాళ్ళకి హక్కు ఉంది కానీ అటవీ స్థలాల మీద వాళ్ళకి ఎలాంటి హక్కు లేదు. కానీ దశాబ్దాలుగా కొన్ని స్వార్ధ శక్తులు మరియు దేశ ద్రోహ శక్తులు కలిసి కుకీ, నాగా ప్రజలకి అడవులు మీవే అంటూ మభ్యపెడుతూ వచ్చాయి.
20. మరో వైపు ఆర్టికల్ 371C ఇస్తున్న రక్షణని ఆసరా చేసుకొని కుకీలు దేశద్రోహానికి పాల్పడుతున్నారు. నిజానికి కుకీ తెగ ప్రజలు మణిపూర్ తో పాటు పక్కనే ఉన్న బర్మా దేశంలో కూడా ఉన్నారు. బర్మాలోని సైనిక నియంత ప్రభుత్వం కుకీలని అక్రమంగా భారత్ లోకి పంపించడానికి సహకరిస్తూ వచ్చింది ఇన్నాళ్లూ !
21. మణిపూర్ లోని కొండ ప్రాంతాలలో నివసించే కుకీలు గంజాయిని పండించడం దానిని ప్రాసెస్ చేసి పక్కనే ఉన్న బర్మా దేశంలోకి మరియు బంగ్లాదేశ్ లోని తీసుకెళ్ళి అక్కడ ISI ఏజెంట్లకి అమ్ముతున్నారు. పాకిస్థాన్ ISI కి డబ్బు సమకూరే మార్గాలలో మణిపూర్ లోని కుకీ లు ఉంటున్న అడవులు ఒక మార్గం. కుకీలకి తక్కువ డబ్బు ఇచ్చి హెరాయిన్ ని కొని దానిని అంతర్జాతీయ మార్కెట్ లో ఎక్కువకి అమ్మి దానిని డాలర్ల రూపంలోకి మార్చుకుంటున్నది ISI.
22. పాకిస్థాన్ ISI, బర్మా లోని సైనిక నియంత ప్రభుత్వ అధికారులు, చైనాతో కలిసి మణిపూర్ భౌగోళిక స్వరూపాన్ని మార్చేశారు దశాబ్దాలుగా.
23. బర్మాలో ఉండే కుకీలని మణిపూర్ లోకి రప్పించి వాళ్ళకి దొంగ ఆధార్ కార్డులని ఇస్తూ వచ్చారు మణిపూర్ లో ఉంటున్న కుకీలు! ఈ అక్రమ వలసలని బర్మాలోని సైనిక జుంటా ప్రభుత్వం ప్రోత్సాహిస్తున్నది దశాబ్దాలుగా! దీని వల్ల బర్మా నుండి వచ్చిన కుకీలకి మణిపూర్ లో ST హోదా వస్తుంది !
24. ఎక్కడో కొండ ప్రాంతాలలోని అడవులలో కంప్యూటర్లు, ప్రింటర్లు, లామినేషన్ మిషన్లు పెట్టుకొని నకిలీ ఆధార్ కార్డులు ప్రింట్ చేస్తున్నారు కుకీలు. వీళ్ళకి ఇవన్నీ ఎక్కడ నుండి వచ్చాయి ? ISI వీళ్ళకి ఇవన్నీ సరఫరా చేసి ట్రైనింగ్ ఇచ్చి మరీ ప్రోత్సహిస్తూ వచ్చింది.
25. ఒక్క బర్మా నుండి వచ్చే కుకీలకే కాదు నకిలీ ఆధార్ కార్డులు ఇచ్చేదీ. బంగ్లాదేశ్ నుండి అక్రమంగా మణిపూర్ లోకి వచ్చిన వాళ్ళకి కూడా ఇస్తూ వచ్చారు. దాంతో మైదాన ప్రాంతంలో ఉంటున్న హిందూ మితీ ప్రజల మెజారిటీ తగ్గిపోతూ అక్రమ వలస దారుల సంఖ్య పెరిగిపోయి మితీ ప్రజల జీవనోపాధికి గండి పడ్డది.
26. సమస్య మితీ ప్రజలకి ST హోదా ఇవ్వమని కేంద్రానికి సిఫారసు చేయమని హై కోర్టు ఇచ్చిన ఆదేశాలతో పెద్దది అయ్యింది.
కుకీలకి, నాగాలకి AK-47 లు కొనేంత స్థోమత ఉందా ? హింసకి దిగమని మతాధికారుల నుండి సూచనలు వచ్చాయా ?
వారం క్రితం భారత్ బర్మా కి వార్నింగ్ ఇచ్చింది అక్రమంగా కుకీలని బర్మా నుండి మణిపూర్ లోకి పంపించడం మీద కూడా ఒక కారణం !
మణిపూర్ మెతీ హిందూ ప్రజలు మూడు డిమాండ్లు చేస్తున్నారు ఇప్పుడు.
1. తమకి ST హోదా ఇవ్వాలి హై కోర్టు ఆదేశాల మేరకు.
2. తక్షణమే NRC ని అమలు చేసి అక్రమ వలసదారులని గుర్తించి బయటికి పంపించేయాలి.
3. UCC – యూనిఫాం సివిల్ కోడ్ చట్టాన్ని వెంటనే అమలులోకి తీసుకురావాలి.
4. దేశంలో ఏ రాష్ట్రం కూడా ఇలాంటి డిమాండ్లు చేయట్లేదు అంటే మణిపూర్ లో పరిస్థితి ఎలా ఉందో మనం ఆలోచించుకోవాలి !
2 years ago (edited) | [YT] | 0
View 0 replies
News Basket
గుండెనొప్పి వచ్చినప్పుడు ఒకవేళ మనం ఒంటరిగా వున్నప్పుడు మనకు మనం చేసుకునే ప్రథమ చికిత్స గురించి Dr. గీతా క్రిష్ణస్వామి గారు రాసిన ఈ క్రింది విషయం, ఓ రెండు నిమిషాలు కేటాయించి చదవటం మనకు చాలా మంచిది !
అప్పుడు రాత్రి 7/45 అయింది , ఆరోజు ఎక్కువ పని భారంతో ఆఫీస్ నుంచి బాగా అలసిపోయి తిరిగి వస్తున్నాం,ఎంతో నిస్సత్తువగా,చిరాకుగా కూడా వుంది ! ఇంతలో అకస్మాత్తుగా గుండెలో ఎదో గట్టిగా పట్టేసినట్లు తీవ్రంగా నొప్పి మొదలయింది ,ఆ నొప్పి అలా భుజాలవరకు,ఇంకా పైకి దవడల వైపు కూడా ప్రాకుతోంది ! అప్పటికి ఇంకా ఇల్లు చేరలేదు,హాస్పిటల్ కు చేరుకోవటానికి దూరం కనీసం 5 కిలోమీటర్లు వుంది కానీ అతి త్వరలో అక్కడకు చేరుకోగలమా అన్న సందేహంతో మరింత కంగారు కూడా మొదలయ్యింది !
ఇలాంటి క్లిష్ట సమయంలో హాస్పిటల్ చికిత్స అందే లోపల ఒకరికి ఒకరు, వెంటనే ఇచ్చే CPR చికిత్స గురించి తెలిసినా, ఎవరికి వారే చికిత్స చేసుకునే విధానం తెలియక ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు, మరేం చేయాలి ?......
ఇటువంటి సంకట పరిస్థితిలో హాస్పిటల్ చికిత్స అందే లోపల మన ప్రాణాలను మనమే ఎలా కాపాడుకోవచ్చో Dr గీతా క్రిష్ణ స్వామి గారు చెప్పిన సలహా చాలా అద్భుతం ! అది చాలా సులభం అని కూడా మీకు తెలుస్తుంది ఈ క్రిందిది చదివిన తరువాత !
ఆ క్లిష్టమైన ఘడియలలో గుండె కొట్టుకోవటంలో లయ తప్పుతోందని మనకు అర్థం అవుతున్న సమయంలో, దగ్గరలో ఎటువంటి సహాయం అందే మార్గం లేనప్పుడు, ఇక స్పృహ కోల్పోతామేమో సమయానికి........ మనకు ఇంకా ఓ పది సెకండ్ల సమయం మాత్రం మన చేతిలో వుంది, మనం పూర్తిగా స్పృహ కోల్పోవటానికి ! ఈలోగా ?????😱
అలాంటి ఆ పది సెకండ్ల అమూల్యమైన సమయంలో మనం చేయవలసినది ఒక్క దగ్గటం మాత్రమే ! 😊 ! ఆశ్చర్యంగా వుంది కదూ ! ఆ దగ్గు రిపీట్ చేస్తుండటమే ! అది ఎలా అంటే, దగ్గే ముందు ఊపిరి బాగా పీల్చుకుంటూ దగ్గుతుం డాలి, ఒకసారి ఊపిరి పీల్చుకుని
దగ్గటానికి రెండు సెకండ్ల చొప్పున కేటాయిస్తూ,బాగా లోతునుంచి, ఒకవేళ కఫం వున్నట్లయితే,అది బయటకు వచ్చేటట్లు ఎలా దగ్గుతామో అంత ఉదృతంగా, ఆగకుండా మనకు ఏదైనా సహాయం అందే వరకూ దగ్గుతూనే వుండాలి అలా ! ఈలోగా గుండెలో సరి అయిన మార్పు వచ్చి మాములుగా కొట్టుకోవటం కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది !
ఈ దగ్గటం మనకు ఎంతలా సహాయ పడుతుందంటే , మనం గట్టిగా ఊపిరి పీల్చి నప్పుడు, మన ఊపిరి తిత్తులు, ప్రాణ వాయువుతో ( ఆక్సిజన్) పూర్తిగా నిండి, గుండె మీద వొత్తిడి తెచ్చిపెడుతుంది,ఆ వొత్తిడి వల్ల గుండెలో వున్న రక్త నాళాలు స్పందించి, మరల సరిఅయిన రీతిలో రక్త ప్రసరణ జరిగి, గుండె కొట్టుకోవటంలో లయ మరల యధాస్థితికి చేరు కోవటానికి తోడ్పడుతుంది ! అంటే చికిత్స అందే లోపల మనకు మనమే ప్రథమ చికిత్స చేసుకుంటు ఇలా ప్రాణాలను నిలుపు కుంటున్నామన్న మాట !
ఇటువంటి ఉపయోగకరమైన సమాచారం మనం ఎంత మందికి పంపిస్తే అందులో కొంత మందికైనా ఇది ఉపయోగ పడి వారి ప్రాణాలు నిలిపిన వారి మౌతాం !
హృద్రోగ నిపుణులు కూడా అదే చెబుతున్నారు
అందువల్ల, మనం రోజూ పంపించే మెసేజెస్ తో పాటు ఇదీ కూడా కలపి పంపించి నట్లైతే పరోక్షంగానైనా ఎందరికో సహాయ పడిన వాళ్ళ మవుతాం
2 years ago | [YT] | 4
View 0 replies
News Basket
ఆంధ్రప్రదేశ్ వైభవం ఉట్టిపడేలా గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సు.
రేపు జరగనున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సు కు సర్వం సిద్ధం చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
#AdvantageAP #APGIS2023
2 years ago | [YT] | 1
View 0 replies
News Basket
తారకరత్న నివాసానికి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ దంపతులు - తారకరత్న భౌతికకాయానికి నివాళులర్పించిన లోకేశ్, బ్రాహ్మణి
2 years ago | [YT] | 0
View 0 replies
Load more