Maraboina Ravi Yadav
Serilingampally Constituency


BRS Team MRY

*బీఆర్‌ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు.*

ఈ రోజు పార్టీ శ్రేణులందరికీ ఒక ముఖ్యమైన విషయం స్పష్టంగా తెలియజేయదలుచుకున్నాను. ఎలాంటి నిరాశకూ, సందిగ్ధతకూ చోటు లేదు. ఎందుకంటే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ రామన్న కేటీఆర్ గారు, కుకట్‌పల్లి ఎమ్మెల్యే శ్రీ మాధవరాం కృష్ణారావు గారు చాలా స్పష్టంగా ప్రకటించారు— *సీనియర్లకు మొదటి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.*
♦️ * శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని మూడు డివిజన్లకు నాయకత్వం *మారబోయిన రవి యాదవ్ గారిదే.*

🔹పార్టీలోకి కొత్త కార్యకర్తలు చేరుతున్నారు, ఇంకా చేరుతూనే ఉంటారు. ఇది పార్టీ బలానికి నిదర్శనం. వారి రాకతో ఎవ్వరూ కంగారు పడాల్సిన అవసరం లేదు. పార్టీలోకి ఎవరు వచ్చినా, వారు రవి యాదవ్ గారి నాయకత్వంలోనే పనిచేస్తారు. మూడు డివిజన్ల పర్యవేక్షణ పూర్తిగా రవి యాదవ్ గారిదే. ఇది తుది నిర్ణయం – ఇందులో ఎలాంటి సందేహానికి ఆస్కారం లేదు.

🔹కాబట్టి, ఎవరు ఏమన్నా, ఎలాంటి అపప్రచారాలు చేసినా వాటికి ప్రాధాన్యం ఇవ్వకండి. ఎప్పటిలాగే నాపై నమ్మకం ఉంచండి. మీరు ఇప్పటివరకు అందించిన ప్రేమ, విశ్వాసంతో ముందుకు సాగుతున్నారు. అదే ప్రేమతో ఎల్లప్పుడూ మీతోనే ఉంటాను

🔹మీ రవి యాదవ్ – నిన్న, నేడు, రేపు కూడా – బీఆర్‌ఎస్ పార్టీ కోసం, శేరిలింగంపల్లి ప్రజల కోసం అంకితభావంతో నిలబడతాను.
మనమంతా ఐక్యంగా నిలబడి, పార్టీని మరింత బలోపేతం చేసి, రాబోయే ప్రతి రాజకీయ పోరాటంలో బీఆర్‌ఎస్ జెండాను ఎగరేద్దాం.

జై తెలంగాణ
జై కేసిఆర్
జై బీఆర్‌ఎస్ ✊🚗

4 days ago | [YT] | 134

BRS Team MRY

*బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ రామన్న (కేటీఆర్) గారిని కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసిన శేరిలింగంపల్లి బీఆర్ఎస్ రాష్ట్ర నాయకలు మారబోయిన రవి యాదవ్ గారు.*

5 days ago | [YT] | 222

BRS Team MRY

ఈ కొత్త సంవత్సరం... మీ జీవితంలో వెలుగులు నింపాలి. సరికొత్త విజయాలను అందించాలి.. ప్రతి ఒక్కరికి సంతోషంతో గడపాలి..

నూతన సంవత్సర శుభాకాంక్షలు ❤️

#HappeNewYear #TeamMRY #2026

1 week ago | [YT] | 162

BRS Team MRY

వైకుంఠ ఏకాదశి పర్వదినాన కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరస్వామి వారి దివ్యాశీస్సులు ప్రజలందరిపై ఉండాలని కోరుకుంటూ... ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు🙏🙏
#VaikunthaEkadashi

1 week ago | [YT] | 93

BRS Team MRY

తెలంగాణ జాతిపిత బాపు కేసీఆర్ గారితో భేటీ శేర్లింగంపల్లి పరిస్థితులపై కీలక చర్చ జరిగింది #KCR

1 week ago | [YT] | 221

BRS Team MRY

*తెలంగాణ జాతిపిత బాపు కేసీఆర్ గారితో భేటీ* – *మారబోయిన రవి యాదవ్ శేరిలింగంపల్లి పరిస్థితులపై కీలక చర్చ జరిగింది*

ఈరోజు తెలంగాణ రాష్ట్రం సాధించిన తొలి ముఖ్యమంత్రి *శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (తెలంగాణ జాతిపిత) కేసీఆర్ గారిని* నందినగర్ నివాసంలో బీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు *మారబోయిన రవి యాదవ్ గారు* మర్యాదపూర్వకంగా కలిశారు.

*తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి పునాది వేసిన మహానాయకుడిగా కేసీఆర్ గారి నాయకత్వం రాష్ట్ర ప్రజలకు ఎప్పటికీ మార్గదర్శకమని రవి యాదవ్ పేర్కొన్నారు. ఉద్యమ సమయంలోనూ, పాలనలోనూ కేసీఆర్ గారు తీసుకున్న ధైర్యమైన నిర్ణయాలు తెలంగాణను దేశంలోనే ఆదర్శ రాష్ట్రంగా నిలిపాయని అన్నారు.*

*ఈ సందర్భంగా రాష్ట్ర మరియు శేరిలింగంపల్లి రాజకీయ పరిస్థితులు, బీఆర్‌ఎస్ పార్టీ భవిష్యత్ కార్యాచరణ, తెలంగాణ ప్రజల హక్కుల పరిరక్షణపై విస్తృతంగా చర్చించారు. కేసీఆర్ గారి ఆశయాలను శేరిలింగంపల్లి నుంచి రాష్ట్రస్థాయి వరకు ప్రజల్లోకి తీసుకెళ్లడమే తమ లక్ష్యమని రవి యాదవ్ స్పష్టం చేశారు.*

*శేరిలింగంపల్లిలో బీఆర్‌ఎస్ పార్టీని మరింత శక్తివంతంగా తీర్చిదిద్దేందుకు, ప్రజల సమస్యల పరిష్కారానికి నిరంతరం పోరాటం చేస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.*

1 week ago | [YT] | 247

BRS Team MRY

పేదల పెన్నిధి, దివంగత ప్రజానేత పీ. జనార్దన్‌రెడ్డి (పీజేఆర్) గారి వర్ధంతి సందర్భంగా వారికి ఘన నివాళులు అర్పిస్తున్నాము 🙏

1 week ago | [YT] | 164

BRS Team MRY

On behalf of first death anniversary of our Indian Eminent person, visionary leader, legendary Industrialist, great donor #ratantata ji, paying respectful tributes to that great Mahaneeya. Johar RatanTata ji johar.

1 week ago | [YT] | 115

BRS Team MRY

*ఈ రోజు తెలంగాణ భవన్‌లో నిర్వహించిన శేరిలింగంపల్లి నియోజకవర్గం ఆల్విన్ కాలనీ డివిజన్ కాంగ్రెస్ నాయకుడు అనిల్ రెడ్డి, కేటీఆర్ సమక్షంలో అధికారికంగా బీఆర్ఎస్ పార్టీలో చేరారు.*

ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన కుకట్‌పల్లి ఎమ్మెల్యే శ్రీ మాధవరం కృష్ణారావు గారి నాయకత్వంలో బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు *మారబోయిన రవి యాదవ్* పాల్గొన్నారు. ఈ సందర్భంగా అనిల్ రెడ్డికి గులాబీ కండువా కప్పి కేటీఆర్ పార్టీలోకి ఆహ్వానించారు. అలాగే ఆయనతో పాటు వేలాది మంది బీఆర్ఎస్ పార్టీలో చేరారు

ఈ కార్యక్రమంలో ఎంఎల్‌సీ శంభిపూర్ రాజు, గచ్చిబౌలి మాజీ కార్పొరేటర్ కొమటి సాయి బాబా, చందానగర్ మాజీ కార్పొరేటర్ నవతా రెడ్డి, వల్ల హరీష్ రావు, కొండాపూర్ డివిజన్ నాయకుడు అల్లావుద్దీన్ పటేల్‌తో పాటు పలువురు బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

*ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గత కొన్ని రోజులుగా వాడుతున్న అసభ్యకర భాష మరియు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పట్ల చేస్తున్న అనుచిత వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.*

*ఈ సందర్భంగా కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ.. కాంగ్రెస్ నేతలు నోటిని అదుపులో పెట్టుకోవాలని సూచించారు. హైదరాబాద్‌ను అభివృద్ధి చేసిన గొప్ప నాయకుడు కేటీఆర్ అని కొనియాడారు. శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ ఏ పార్టీలో ఉన్నాడో కూడా చెప్పడం లేదని విమర్శించారు. అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కలిసి కూర్చోవడం లేదని అన్నారు.*

*కేటీఆర్ నాయకత్వంలో గత జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో 99 సీట్లు గెలిచామని మాధవరం గుర్తుచేశారు. బీఆర్ఎస్ సింగిల్‌గా జీహెచ్‌ఎంసీ మేయర్ పీఠాన్ని స్వాధీనం చేసుకుందని తెలిపారు. కార్యకర్తలు, ప్రజలను కాపాడుకున్నవాడే నాయకుడు అవుతాడని అన్నారు.*

ఈ కార్యక్రమం లో సాయి నందన్ ముదిరాజ్, పవన్, శ్రీకాంత్ యాదవ్, శ్రీశైలం యాదవ్, మజీద్, సంతోష్, శేరిలింగంపల్లి నియోజకవర్గం బీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు, కార్యక్రతలు పెద్ద సంఖ్యల పాల్గొన్నారు

1 week ago | [YT] | 175

BRS Team MRY

ఈ రోజు నందీనగర్‌లోని తన నివాసంలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రామన్న (కేటీఆర్) గారిని శేరిలింగంపల్లి నియోజకవర్గ బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు మారబోయిన రవి యాదవ్ మర్యాదపూర్వకంగా కలిశారు.

1 week ago | [YT] | 169