Welcome to Mana Dharmam!

At Mana Dharmam, we explore the profound rituals and traditions of Hindu puja vidhanam. Our aim is to guide you through the correct methods of performing various pujas and provide clarity on common doubts regarding spiritual practices. Whether you’re a beginner or someone seeking deeper understanding, this channel will serve as your spiritual companion on your dharmic journey.

Stay tuned for detailed explanations and answers to all your ritual-related queries.

Subscribe now and let’s uphold our sacred traditions together!
మన ధర్మంలోకి స్వాగతం!

మన ధర్మం ద్వారా హిందూ పూజా విధానం, సంప్రదాయాల గొప్పతనాన్ని అన్వేషిద్దాం. వివిధ పూజలు సరిగ్గా ఎలా చేయాలో మీకు సులభంగా వివరించడమే కాక, ఆధ్యాత్మిక సాధనలపై ఉన్న సందేహాలను నివృత్తి చేయడమే మా లక్ష్యం. మీరు ప్రారంభ స్థాయిలో ఉన్నా లేదా లోతైన ఆధ్యాత్మిక జ్ఞానం కోరుకునేవారైన మీరు, ఈ ఛానల్ మీ ధార్మిక ప్రయాణానికి స్నేహితుడిగా ఉంటుంది.

పూజా సంప్రదాయాలు, పూజ విధానాలు
మన సంప్రదాయాలను కాపాడుదాం!


ManaDharmam

🙏 శ్రీ నందీశ్వర అభిషేక ఆహ్వానం 🙏

17.12.2025
త్రయోదశి శుభతిథి సందర్భంగా
సాయంత్రం 5:45 నిమిషాలకు
మన ఆలయంలో భక్తి శ్రద్ధలతో
జాతకంలో తెలియని దోషాలు పోగొట్టే
శ్రీ నందీశ్వర అభిషేకం ఘనంగా జరుపబడును.

ఈ పవిత్ర అభిషేక మహోత్సవాన్ని
భక్తులు అందరూ
మనధర్మం YouTube చానెల్‌లో లైవ్ ద్వారా దర్శించి
శ్రీ నందీశ్వర కృపను పొందగలరు.

🙏 శివానుగ్రహంతో మీ కుటుంబానికి సకల శుభాలు కలగాలని ప్రార్థిస్తున్నాము 🙏
🌺 హర హర మహాదేవ 🌺

#NandiAbhishekam #నందిఅభిషేకం
#PostFeed #ShortsFeed #Shorts #shortsfeed #Post #postfeed #ViralPost

1 day ago | [YT] | 311

ManaDharmam

శ్రీవారి మెట్టు దర్శనం
2380 మెట్లు
సమయం మాకు 1గంటా 26 నిమిషాలు పట్టింది..
ఈ మెట్లు ఎక్కినవారు మీ సమయాన్ని తెలుపండి 🙏🙏గోవిందా గోవింద !!🙏🙏

🙏🙏🙏 #Tirupati #ShortsFeed #Shorts #PostFeed #shortsfeed #Tirumala ,🙏🙏🙏

1 week ago | [YT] | 197

ManaDharmam

1 week ago | [YT] | 246

ManaDharmam

🙏 మార్గశిర పౌర్ణమి మహోత్సవం 🙏

మా దేవాలయంలో రేపు (04-12-2025) పర్వదినమైన మార్గశిర పౌర్ణమి సందర్భంగా —

🕉️ దత్తాత్రేయ స్వామి అభిషేకం
⏰ ఉదయం 8:30 గంటలకు ప్రారంభం

🔥 చండీ హోమం
⏰ సాయంత్రం 4:00 గంటలకు ప్రారంభం

ఈ పవిత్ర కార్యక్రమాలకు హాజరై శ్రీ దత్తాత్రేయ స్వామి మరియు దుర్గా దేవి కృపా కటాక్షాలు పొందవలసిందిగా అందరు భక్తులను మనస్పూర్తిగా ఆహ్వానిస్తున్నాము 🙏🙏🙏
In our temple On the Occasion of "Margashirsha Purnima" tomorrow(04.12.2025) we have Abhishekam for Dattareya Swamy🙏🙏starting @8.30 A.M
****CHANDI HOMAM starting @4.00 P.M in the Evening🙏🙏🙏
All devotees are welcome to attend & seek almighty's blessings🙏🙏🙏
#Postfeed #ShortsFeed #Shorts #shortsfeed #post #Viralpost

2 weeks ago | [YT] | 283

ManaDharmam

మా ఆలయంలో మార్గశిర మాసం డిసెంబర్ 2025 నెలలో మొత్తం 7 పవిత్ర అభిషేకాలు నిర్వహించబడతాయి:
5 సోమవారాలు • ఆరుద్ర (మార్గశిర) అభిషేకం • మాస శివరాత్రి

ఈ మహామంగళమైన అభిషేకాలలో పాల్గొని, మీ గోత్రనామాలను పూజల్లో చేర్పించుకోవాలనుకునే భక్తులు ₹501/- (సర్వ సమేతంగా) సమర్పించవచ్చు.

మీ వివరాలతో
పూజారి శ్రీ చంద్రశేఖర శర్మ గారిని సంప్రదించండి
మరియు పరమశివుడి దివ్య కటాక్ష ఆశీస్సులు పొందండి.

హర హర మహాదేవా 🙏🌺 శంభో శంకరా 🌺🙏
In our sacred temple, we are blessed to perform 7 divine Abhishekams during the auspicious month of Dhanurmasam December 2025:
5 Mondays • Arudra (Margashira) Abhishekam • Masa Shivaratri

Devotees who wish to participate and include their Gothra Namas in these holy rituals may offer a contribution of ₹501/- (all-inclusive).

Please contact
Pujari Sri Chandrashekhar Sharma Garu
with your details and receive the divine grace and blessings of Lord Shiva.

Harahara Mahadeva 🙏🌺 Om Namah Shivaya 🌺🙏




#ShortsFeed #Shorts #shortsfeed #PostFeed #Post #Shortsfeed #

2 weeks ago (edited) | [YT] | 356

ManaDharmam

,🌺మన ఆలయంలో డిసెంబర్ 2025 నెలలో మొత్తం 7 అభిషేకాలు నిర్వహించబడనున్నాయి:
5 సోమవారాలు • ఆరుద్ర (మార్గశిర) అభిషేకం • మాస శివరాత్రి.

ఈ పవిత్ర అభిషేకాలలో మీ గోత్రనామాలు చేర్చించుకోవాలనుకునే భక్తులు ₹501/- (అన్నీ కలుపుకొని) సమర్పించవచ్చు.

వివరాల కోసం పూజారి శ్రీ చంద్రశేఖర్ శర్మ గారిని సంప్రదించండి. 9912253773,or 9493372727
శ్రీ పరమేశ్వరుని కృప, ఆశీర్వాదాలు మీ కుటుంబంపై ఉండాలని కోరుకుంటున్నాము.
🌺🙏 హర హర మహాదేవ 🙏🌺

In our temple, we will be performing a total of 7 Abhishekams during December 2025:
5 Mondays • Arudra (Margashira) Abhishekam • Masa Shivaratri.

Devotees who wish to participate and include their Gothra Namas in these sacred pujas may contribute ₹501/- (all-inclusive).

Please contact Pujari Sri Chandrashekhar Sharma Garu with your details and receive the divine blessings of Lord Shiva. 9912253773 or 9493372727
🌺🙏 Harahara Mahadeva 🙏🌺





#ManaDharmam #ShortsFeed #Shorts #shortsfeed #Trending

2 weeks ago | [YT] | 15

ManaDharmam

ఓం కాలకాలాయ విద్మహే, కాలాతీతాయ ధీమహి, తన్నో కాల భైరవ ప్రచోదయాత్

#OmKaalaBhairavayaNamah #ShortsFeed #Shorts #shortsfeed #ViralShorts #PostFeed #postfeed

2 weeks ago | [YT] | 382

ManaDharmam

🌿🌼 సుబ్రహ్మణ్య షష్ఠి రోజు ఎవరైతే స్కందోత్పత్తి చదువుతారో వారి పిల్లలు ఆపదల నుంచి రక్షింపబడతారు ... 🌼🌿

రామాయణాంతర్గత స్కందోత్పత్తి

పరమేశ్వరుడు తపస్సు చేయుచుండగా పూర్వము దేవతలు ఋషులతో గూడి, సేనాపతిని కోరుకొనుచు బ్రహ్మదేవుని కడకు వెళ్ళిరి. ఇంద్రాది దేవతలు అగ్నిని ముందుంచుకొని, బ్రహ్మదేవునకు ప్రణమిల్లి, ఆయనతో ఇట్లు విన్నవించుకొనిరి. “ఓదేవా! పూర్వము మీరు పరమేశ్వరుని మాకు సేనాపతిగా నియమించియుంటిరి. ఆ శంకరుడు ఇప్పుడు పార్వతీదేవితో గూడి హిమవత్పర్వతమున తపమొనరించుచున్నాడు. కర్తవ్య విధానము నెరిగిన ఓ బ్రహ్మదేవా! ఈ (సెనాపతి) విషయమున లోకహితమును గోరి అనంతర కార్యమును గూర్చి ఆలోచిమ్పుడు. ఇప్పుడు మాకు మీరే దిక్కు”.
దేవతల ప్రార్థనను ఆలకించి, సరలోక సృష్టికర్తయైన బ్రహ్మదేవుడు మృదుమధుర వచనములతో వారిని ఓదార్చుచు ఇట్లు పలికెను.

“పార్వతీదేవి శాప కారణముగా మీకు మీ పత్నులయందు సంతానము కలుగు అవకాశము లేదు. ఆమె వచనము తిరుగులేనిది. ఇది ముమ్మాటికిని సత్యము. ఇందు సందేహము లేదు. ఆకాశమున ప్రవహించు ఈ గంగాదేవి యందు అగ్నిదేవుడు ఒక పుత్రుని పొందగలడు. అతడు దేవసేనాపతియై, శత్రు సంహారకుడు కాగలడు. హిమవంతుని పెద్ద కూతురైన గంగ ఆ అగ్నిసుతుని (శివ తేజః ప్రభావమున అగ్నివలన తనయందు జనించిన సుతుని) ఆదరింప గలదు. అతడు పార్వతీదేవికి మిక్కిలి ప్రీతిపాత్రుడగును. ఇందు సంశయము లేదు”.

ఓ రఘునందనా! బ్రహ్మదేవుడు పలికిన ఆ మాటలకు దేవతలందరును సంతసించి, తాము కృతార్థులైనట్లు భావించిరి. అనంతరము వారు బ్రహ్మదేవునకు ప్రణమిల్లి, పూజించిరి. అంతట ఆ దేవతలందరునూ గైరికాదిధాతువులతో విలసిల్లుచున్న కైలాసపర్వతమునకు చేరి, పుత్రోత్పత్తికై అగ్నిదేవుని నియమించిరి. శివతెజమును భరించిన ఓ అగ్నిదేవా! ఈ దేవకార్యమును నెరవేర్పుము. శైలపుత్రికయైన గంగయందు ఆ శివ తేజస్సును ఉంచుము’ అని దేవతలు పలికిరి. అగ్నిదేవుడు దేవతలతో ‘అట్లే’అని పలికి, గంగాదేవి కడకు వెళ్ళి “ఓ దేవీ! గర్భమును ధరింపుము. ఇది దేవతలకు హితమొనర్చు కార్యము” అని నుడివెను. అప్పుడు గంగ ఆయన మాటలను విని దివ్యమైన స్త్రీ రూపమును ధరించెను. అగ్ని ఆమె సౌందర్యాతిశయమును జూచి, శివతేజమును ఆమెయందంతటను వ్యాపింపజేసెను.
ఓ రఘునందనా! అగ్ని ఆమెపై వ్యాపింపజేసిన శివతేజముతో గంగా ప్రవాహములన్నియును నిండిపోయెను. ఆ అగ్ని తేజస్సుయొక్క తాపమునకు తట్టుకొనలేక గంగాదేవి సర్వ దేవతలకును పురోహితుడైన అగ్నిదేవునితో “క్షణక్షణమునాకును బలీయమగుచున్న నీ తేజస్సును ధరింపలేకయున్నాను” అని పలికెను. సర్వదేవతల కొరకై సమర్పించెడి ఆహుతులను స్వీకరించునట్టి అగ్నిదేవుడు గంగతో “ఓ దేవీ! ఈ శ్వేత పర్వతప్రదేశమున నీ గర్భమును ఉంచుము’ అని యనెను. మహా తేజస్వివైన ఓ పుణ్యపురుషా! రామా! గంగాదేవి అగ్నిదేవుని మాటలను పాటించి, మిక్కిలి తేజోరాశియైన ఆ గర్భమును తన ప్రవాహములనుండి అచట వదలెను. గంగానది గర్భమునుండి వెడలిన తేజస్సు మేలిమి బంగారము వలె కాంతిమంతమై యుండెను. కనుక ఆ తేజస్సు ఉంచబడిన భూమియు, అచటి వస్తువులన్నియును సువర్ణమయములాయెను. ఆ పరిసరములన్నియును రజిత మయములై నిరుపమానమైన కాంతితో వెలుగొందెను. ఆ తేజస్సు యొక్క తీక్ష్ణత్వము వలన రాగి ఇనుము పుట్టెను. ఆ రేతస్సు యొక్క మలము తగరము, సీసము ఆయెను. ఈవిధంగా ఆ తేజస్సు భూమిని జేరి, వివిధ ధాతువులుగా రూపొందెను.

ఆ గర్భము భూమిపై ఉంచబడగానే దాని తేజః ప్రభావముచే ఆశ్వేతపర్వతమూ, అందలి శరవణమూ(రెల్లుగడ్డి) సువర్ణమయములై తేజరిల్లసాగెను. పురుష శ్రేష్ఠుడైన ఓ రాఘవా! అగ్నితో సమానమైన కాంతి గల ఆ బంగారము అప్పటినుండియు ‘జాతరూపము’ అను పేరుతో ప్రసిద్ధికెక్కెను. అచటి తృణములు, వృక్షములు, లతలు, పొదలు మొదలగునవి అన్నియును స్వర్ణమయములాయెను. తదనంతరము అచట జన్మించిన కుమారునకు పాలిచ్చి పోషించుటకై, ఇంద్రుడు, మరుద్గణములు మొదలగు దేవతలు ఆరుమంది కృత్తికలను నియోగించిరి. “ఈబాలుడు మా అందరి యొక్క పుత్రుడగును” అని ఆ కృత్తికలు దేవతలతో ఒప్పందము చేసుకొనిరి. పిమ్మట ఆ నిశ్చయముతో అప్పుడే పుట్టిన ఆ శిశువునకు పాలియ్యసాగిరి. అంత దేవతలందరును “ఈ బాలకుడు కార్తికేయుడు అను పేరుతో ముల్లోకముల యందును ఖ్యాతికెక్కును. ఇందు సంశయము లేదు” అని పలికిరి.
గంగాద్వారా అచటికి చేరిన శివతేజస్సు యొక్క ప్రభావమున పుట్టిన ఆ బాలుడు అగ్నివలె వెలుగొందుచుండెను. దేవతలా మాటలను విని, వారి ఆదేశమును అనుసరించి, కృత్తికలు ఆ బాలకునకు స్నానము చేయించిరి. ఓ కాకుత్స్థా! గంగాదేవి గర్భమునుండి స్ఖలితుడైనందున దేవతలు అగ్నితుల్యుడై, కారణజన్ముడైన ఆ మహానుభావుని ‘స్కందుడు’ అని పిలువసాగిరి. కృత్తికల పోషణ వలన అతనికి ‘కార్తికేయుడు’ అనియు పేరు ఏర్పడెను. అప్పుడు ఆ ఆరుగురు కృత్తికల స్తనములలో సమృద్ధిగా పాలు ఏర్పడెను. ఆరు ముఖములు గలవాడై ఆ బాలుడు ఆ ఆరుగురి నుండి స్తన్యములను గ్రోలెను. సుకుమార శరీరుడైనను ఆ కుమారస్వామి ఒక దినము మాత్రమే వారినుండి పాలుద్రాగి, మహిమాన్వితుడై అతడు తన పరాక్రమము చేత రాక్షస సైన్యములను జయించెను. దేవతలు అగ్నిదేవుని నాయకత్వమున సాటిలేని తేజస్వియైన ఆ బాలుని కడకు చేరి, అతనిని ‘దేవసేనాపతి’గా అభిషేకించిరి.

పవిత్రమైన ఈ గాథను విన్నవారు ధన్యులగుదురు. కుమారస్వామి పై భక్తిగల మానవుడు ఈ లోకమున దీర్ఘాయుష్మంతుడై పుత్రపౌత్రులతో వర్ధిల్లును. తుదకు స్కంద సాలోక్య ఫలమును గూడ పొందును.

ఓం శం శరవణభవ

#SubrahmanyaShasti #ShortsFeed #Shorts #shortsfeed #TeluguShorts #PostFeed

3 weeks ago | [YT] | 256

ManaDharmam

సుబ్రహ్మణ్య షష్టి శుభాకాంక్షలు..


కనకమండల మండిత షణ్ముఖం
వనజరాజ విరాజిత లోచనం
నిశిత శస్త్ర శరాశర దారినిం
శరవణోద్భవ మీశ సుతం భజే!!!

మన ఆలయ లొకేషన్ కింద Qr code లో ఉంది స్కాన్ చేయండి..
#ShortsFeed #Shorts #shortsfeed

3 weeks ago | [YT] | 198

ManaDharmam

🌺పంచక్రోసి కాశీయాత్ర 🌺-

ధ్యానం చేసుకునే వారందరికీ, యోగం గురించి తెలుసుకునే మార్గం ఈ పంచకోశ తత్వాన్ని తెలుసుకోవడం. *'కోశము' అంటే అర అని అర్ధం. మానవుని జీవనంలో ఐదు అరలు కలిగిన తత్వాన్ని తెలుసుకోవడమే ధ్యానం... అదే కాశీ యాత్రలోని పంచక్రోసి కాశీ యాత్రగా అభివర్ణిస్తారు.*

*మనలో ఉండే ఐదు అరల పేర్లు:-*
1. అన్నమయ కోశము
2. ప్రాణమయ కోశము
3. మనోమయ కోశము
4. విజ్ఞానమయ కోశము
5. ఆనందమయ కోశము... అని ఐదురకాలుగా ఉంటుంది. ఇదేవిధంగా కాశీలోని ఐదు మహా శివలింగాలు పంచకోశములుగా ఉండి అవి మనలోని పంచకోశములతో అనుసంధానించుకుంటూ ఈ యాత్ర ఐదురోజుల పాటు చేస్తాము. ఇది ఇప్పుడు మొదలైనది కాదు. యుగయుగాలుగా ఎంతో మంది, ఎన్నో అనుభవాలతో చేసిన యాత్ర.

*త్రేతాయుగంలో రాముడు* అరణ్యవాసం సమయంలో, సీతాదేవి, లక్ష్మణుడితో కలిసి, దశరథుడు చనిపోయిన తరువాత ఈ యాత్ర చేసాడు. రెండవసారి రావణాసురుడు చనిపోయాక మరొకసారి ఈ యాత్ర చేసినట్లు అక్కడి సత్రములో కలిసిన వారు, అర్చకులు కూడా చెబుతుంటారు. అలాగే *ద్వాపరంలో ద్రౌపదితో కలిసి పంచపాండవులు* ఈ యాత్ర చేసుకున్నారని, ద్రౌపదీకుండ్ గా గంగానదికి అక్కడ ఆ పేరుతో ఉంటుంది. ఈ యాత్రను ఫాల్గుణ మాసంలో, చైత్రమాసంలో, అధికామాసాల్లో, అమావాస్యకు, శివరాత్రి రోజు, కుంభమేళాకు, అర్ధకుంభమేళాకు భక్తులు అత్యథిక సంఖ్యలో ఈ యాత్ర చేస్తారు.

*ఈ యాత్రలో మనకు మొత్తం 11 వినాయకుడి విగ్రహాలు, 108 శివలింగాలు, 56 దేవాలయాలు, 4 విష్ణువు ఆలయాలు, 2 భైరవాలయాలు, 15 ఇతరములైన దైవాల ఆలయాలు కనిపిస్తాయి.* ఇవి కాకుండా, కర్థమేశ్వర్ (అన్నమయ), భీంచండీ మందిర్ (ప్రాణమయ), రామేశ్వర్ (మనోమయ), శివపురి మందిర్ (విజ్ఞానమయ), గంగావినాయకుడి గుడి (ఆనందమయ) మొదలైన గుడులన్నీ చూడవచ్చును.

మొత్తం ఈ యాత్ర *5 నిద్రలతో 6 పగళ్ళు చేసే యాత్ర.*

మొదట విశ్వనాథ ఆలయంలోని జ్ఞానవాపి దగ్గర సంకల్పం చెప్పుకుని, పంచకోశ వినాయకుడిని దర్శించుకుని,
*"పంచక్రోశాత్మకాయ, మహాలింగాయా! జ్యోతిర్లింగ స్వరూపాయ, కాశీవిశ్వేశ్వరాయ, శ్రీ శివాయనమః"* అంటూ, ఆయన అనుమతితో ఈ పంచకోశ యాత్ర మొదలు పెట్టాలి. విశ్వనాథ, అన్నపూర్ణమ్మా ఇతర ఉపాలయాలలోని దేవతలందరి అనుమతితో పాటు, మిగిలిన ఉపాలయాల్లో యాత్ర నిర్విఘ్నంగా సాగాలని అనుమతి తీసుకుంటూ అందరిని ప్రార్థించుకుని యాత్ర మొదలు పెట్టాలి.

విశ్వనాథ దేవాలయం నుండి మణికర్ణికా ఘాట్ కొచ్చి, కుండంలో స్నానం చేసి, సంకల్పం చెప్పుకుని, కాళ్లకు చెప్పులు లేకుండా, కొంచెం సామాను, ఐదు రోజులకు సరిపడా బట్టలు, తినడానికి కొంచెం ఆహారం, నీళ్ళ బాటిల్, కొంచెం పూజా సామగ్రి తీసుకుని బయలుదేరాలి.

మణికర్ణికలో వినాయకుడిని, మణికర్ణికేశ్వరుడిని, మిగిలిన ఉపాలయాల్లోనూ మొక్కుకుని యాత్ర మొదలు పెట్టాలి. ఎటునుంచి ఎక్కడివరకు తిరగాలో ఎవరినడిగినా చెబుతారు. మొత్తం ఐదు చోట్ల ఆగాలి.
*1. ఒకటవ మజిలీ (అన్నమయ కోశం):* మొదటి మజిలీ చౌరాశీ ఘాట్లో ఉన్న ధర్మశాలలో ఆగుతాము. అక్కడ కర్ధమేశ్వరాలయంలో ధూళీపాద దర్శనం అయ్యాక, బిందుసరోవర్ ఘాట్ లోని కర్థమేశ్వర్ కుండ్ లో స్నానం చేసి దర్శనం చేసుకుని ఆరాత్రి విశ్రాంతి తీసుకుని, ఉదయం మళ్లీ అదే కుండంలో స్నానం చేసి, జపం చేసుకుని తిరిగి యాత్ర కొనసాగించాలి.

*2.రెండవ మజిలీ (ప్రాణమయ కోశం) :* రెండవరోజు రాత్రి గంధర్వసాగర్ ఘాట్లోని ధర్మశాలలో విశ్రాంతి తీసుకుని, రెండవరోజు ఉదయం గంధర్వ సాగర్లో స్నానం చేసి, అక్కడి 'భీంచండీ' ఆలయంలో వినాయకుడు, చండీశ్వరుడు, మిగిలిన ఉపాలయాల్లోనూ దర్శనం, జపము చేసుకుని యాత్ర కొనసాగించాలి.

*3.మూడవరోజు మజిలీ (మనోమయ కోశం) :* వరుణానదీ సమీపంలో ఉన్న ధర్మ సత్రాల్లో బసచేసి విశ్రాంతి తీసుకుని, వరుణానదిలో స్నానంచేసి రామలింగేశ్వరుని దర్శనం చేసుకుని జపం చేసుకుని, ఉపాలయాల్లో దర్శించుకుని తిరిగి యాత్ర మొదలుపెట్టాలి.

*4.నాలుగవరోజు మజిలీ (విజ్ఞానమయ కోశం) :* ఈ రోజు యాత్ర మొత్తం ద్వాపరాయుగానికి సంబంధించిన విశేషాలు ఎక్కువగా తెలుస్తాయి. పాండవులు ద్రౌపదితో కలిసి చేసిన అరణ్యవాసం సమయంలో ఇక్కడికి వచ్చి, ఈ పంచక్రోశ యాత్ర చేసినట్లు అక్కడి విగ్రహాల ద్వారా, చుట్టుప్రక్కల మనతో పాటు యాత్ర చేస్తున్న అనేకమంది చెప్పే కథల వలన తెలుసుకోవచ్చు. ఉత్తర భారతీయ గ్రామస్థులు ఎక్కువగా ఈ యాత్ర చేస్తూ కనిపిస్తారు. కోందరు నాలా యాత్ర చేసేవారికి భోజనం (కిచిడీ) చేసి ఇస్తుంటారు. నాలుగవరోజు 'ద్రౌపదీకుండ్' లో స్నానం చేసి, 'శివపురిమందిర్' లోని వినాయకమందిర్ నుండి అన్ని దేవలయాల్లోనూ దర్శనం చేసుకుని, జపం చేసుకుని తిరిగి యాత్ర ప్రారంభించాలి.

*5.ఐదవరోజు మజిలీ (ఆనందమయ కోశం) :*
'కపిల్దారా' లోనీ గంగావినాయకుడి గుడితో మన యాత్ర ముగుస్తుంది. ఇక్కడికి దగ్గరలోని ధర్మశాలలో విశ్రాంతి తీసుకుని, ఉదయం కపిలధారాలో స్నానం చేసి, వినాయక దర్శనం జపం చేసుకుని విశ్వనాథ దర్శనానికి బయలుదేరి విశ్వనాథ ఆలయంలో ధూళిపాద దర్శనం చేసుకుని, మన నివాసానికి వచ్చి రెండురోజులు విశ్రాంతి తీసుకుని అలౌకికమైన ఆ తాధ్యాత్మికతనుండి తిరిగి యధాస్థాన ప్రవేశయామి అనుకుంటూ మన మన భవసాగరాలకు తిరుగుప్రయాణం చేయాల్సిందే కదా!

ప్రతీ చోటా అమ్మవార్లకు జాకెట్టు ముక్క, పసుపు కుంకుమ, అయ్యవార్లకు దావళీలు సమర్పించవచ్చు. అవన్నీ పట్టుకుని తిరగలేము అనుకునే వారు శక్తి కొలది దక్షిణ సమర్పించుకోవచ్చు.

శారీరక అనారోగ్యాలున్నవారు చేయలేని యాత్ర ఇది.
ఆహారాన్ని రోజుకు ఒకసారి, అదికూడా సూర్యాస్తమయం తరువాత తీసుకునే నియమంతో చేస్తే యాత్ర సజావుగా సాగుతుంది. పండ్లు, డ్రై ఫ్రూట్స్, అప్పుడప్పుడు తాగడానికి ఏమైనా దొరుకుతుంటాయి. వాటితో సరిపెట్టుకుంటూ యాత్ర చెయ్యాలి. నేను గ్లూకోస్, సాల్ట్ అండ్ షుగర్ కలిపిన పొడి కొంచెం, కొన్ని చాకలెట్స్ తీసుకెళ్ళాను.

మొదటిసారి కార్లో వెళ్లి మొత్తం యాత్రలో ఎక్కడెక్కడ ఆగాలి అని తెలుసుకున్నాను. రెండవసారి ఆటోలో ఆ చిన్న గల్లీల్లోకి ఎలా వెళ్ళాలో చూసాను. మూడవసారి పడవలో చూసాను. నాలుగు, ఐదు నడిచి తిరిగాను ఈ యాత్ర మొత్తం. *మొత్తం సుమారు 100 కిలోమీటర్లు నడవాలి ఐదురోజుల్లో.* ఒళ్లునొప్పులు, తలనొప్పి, జ్వరం కోసం మందులు తీసుకెళ్లాలి. లగేజీ చివరకు వచ్చేసరికి మోయలేము. నేను పాత డ్రస్సులు వేసుకుని, ఒక్కొక్కరోజు ఒక్కొక్క ఘాట్లో స్నానం చేసి అక్కడే వదిలేస్తూ వచ్చాను. అందుకని ఆఖరుకి చేతిలో తక్కువ లగేజీ అయ్యేటప్పటికి నిజమైన ఆనందమే అనుభవించాను.

*హిందువులమై పుట్టిన ప్రతివారు ఒక్కసారి తప్పనిసరిగా చేయవలసిన యాత్ర ఇది. #ShortsFeed #kasiYatra #Vaaranasi #Varanasi #KanchaKrosi #Shorts #shortsfeed

3 weeks ago | [YT] | 35