Chaithu kumar


chaithukumar

పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి మైనర్ బాలికను గర్భవతిని చేసిన వ్యక్తిపై, పోక్సో చట్టం కింద నమోదు చేసిన కేసులో నిందితుడుకి 20 సంవత్సరాలు జైలు శిక్ష మరియు రూ.10,000 వేలు జరిమానా విధించిన గౌరవ ఒంగోలు POCSO కోర్ట్ వారు

👉పోక్సో కేసులో నిందితుడుకి శిక్షబడుటలో కీలక పాత్ర పోషించిన పోలీస్ అధికారులను మరియు సిబ్బందిని అభినందించిన ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ ఏ.ఆర్ దామోదర్, ఐపీయస్., గారు

👉పిల్లలు మరియు మహిళలపై లైంగిక దాడులు చేసే వారిని చట్టం నుంచి తప్పించుకునే అవకాశం లేదు:జిల్లా ఎస్పీ గారు

కొత్తపట్నం మండలం& గ్రామానికి చెందిన మైనర్ బాలికపై(16 సం), అల్లూరు గ్రామానికి చెందిన బత్తుల చంటి@ విల్సన్ S/o రత్నాజ వయసు 28 సంవత్సరాలు అనే వ్యక్తి బాధిత బాలిక తాతయ్య అల్లూరుగ్రామనికి చెందినవారు. బాలిక ఒంగోలు ప్రైవేట్ కాలేజీ లో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతూ ప్రతి ఆదివారం బాలిక మరియు ఆమె కుటుంబ సభ్యులు అల్లూరు చర్చికి వెళ్ళే వారు. ఈ క్రమములో చర్చిలో మైకు ఆరెంజ్ చేసే ముద్దాయి, బాలికతో పరిచయం ఏర్పరచుకొని మాయమాటలు చెప్పి ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. 2019 జనవరి నెలలో ఒక ఆదివారం, తల్లిదండ్రులు అల్లూరు చర్చికి వెళ్లిన సమయంలో అల్లూరు ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో బాలికకు మాయమాటలు చెప్పి శారీరకంగా సన్నిహితంగా ఉన్నట్లు, తరువాత కూడా తల్లిదండ్రులు ఇంటిలో లేని సమయంలో పలుమార్లు సన్నిహితంగా ఉన్నట్లు, ఈ విషయం ఎవరికైనా చెబితే నిన్ను మరియు నీ తల్లిదండ్రులను చంపేస్తానని బెదిరించాడు. దీంతో బాధితురాలు భయంతో ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పలేదు. కొన్ని రోజులు గడిచిన తర్వాత బాలిక అనారోగ్యంగా ఉండటంతో, తల్లిదండ్రులు ఒంగోలు లోని ఒక ప్రైవేట్ హాస్పిటల్‌కు తీసుకెళ్లగా, గర్భం వచ్చిందని డాక్టర్లు తెలియజేశారు. అప్పుడు తల్లిదండ్రులు గట్టిగా ప్రశ్నించగా బాలిక అసలు విషయం వివరించింది. అనంతరం బాలిక తన తల్లిదండ్రులతో కలిసి 06.08.2019 తేదీన కొత్తపట్నం పోలీస్ స్టేషన్‌కి వెళ్లి ఫిర్యాదు చేసారు. అప్పటిలో SI M. శ్రీనివాసరావు గారు కేసు నమోదు చేశారు. బాధితురాలి ఫిర్యాదుతో కొత్తపట్నం పోలీసులు కేసు నమోదు చేసి, అప్పటి ఒంగోలు DSP K.V.V.N.V ప్రసాద్ గారు కేసు దర్యాప్తు చేసి, ముద్దాయిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. చార్జ్‌షీట్‌ను కోర్టులో దాఖలు చేశారు.

అనంతరం, పోలీసులు సమయానుసారం సాక్షులను కోర్టులో హాజరుపరిచారు. ఈ సందర్భంగా, స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గొట్టిపాటి శ్రీనివాసరావు గారు ప్రాసిక్యూషన్ తరపున వాదనలు వినిపించారు. జిల్లా ఎస్పీ గారి మార్గదర్శకత్వంలో ప్రత్యేక పోక్సో మానిటరింగ్ టీం ద్వారా సమర్థవంతంగా ట్రయల్ నడిపి సరైన సాక్ష్యాధారాలతో నిందితునిపై పలు సెక్షన్ ల క్రింద నేర నిరూపణ చెయ్యడంతో, దీని ఫలితంగా తేదీ:20.08.2025న ఒంగోలులోని గౌరవ POCSO కోర్ట్ జడ్జి శ్రీ కె.శైలజ గారు నిందితునికి 20 సంవత్సరాలు జైలు శిక్ష మరియు రూ.10,000/- జరిమానా విధించారు. అదే విధంగా భాదితురాలకి 3 లక్షలు, బాబుకు 3 లక్షలు పరిహారం అందేలా చూడాలని జిల్లా న్యాయసేవ అధికార సంస్దను కోర్ట్ ఆదేశించింది.

ఈ నేపథ్యంలో ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ ఏ.ఆర్ దామోదర్ ఐపీయస్ గారు మాట్లాడుతూ, లైంగిక వేధింపులు మరియు అత్యాచారాలకు పాల్పడే వ్యక్తులకు ఇటువంటి తీర్పులు గుణపాఠంగా నిలవాలని అన్నారు. మహిళలు మరియు మైనర్ బాలబాలికలపై అఘాయిత్యాలు జరగకుండా నివారించేందుకు, జిల్లా పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా పాఠశాలలు మరియు కళాశాలల్లో ‘గుడ్ టచ్ - బ్యాడ్ టచ్’ తేడా, స్వీయ రక్షణ పద్ధతులు, POCSO చట్టంపై అవగాహన, ఈవ్ టీజింగ్, ప్రేమ పేరుతో మోసాలు, మహిళలపై జరుగుతున్న నేరాలు మరియు అవాటి పై ఉన్న చట్టాల గురించి విద్యార్థులకు విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నామన్నారు. బాలికలు ధైర్యంగా ఉండాలని, ఏదైనా సమస్య ఎదురైతే వెంటనే తల్లిదండ్రులకు చెప్పాలని సూచించారు. అలాగే తల్లిదండ్రులు కూడా తమ పిల్లలపై ఎప్పటికప్పుడు ప్రత్యేక శ్రద్ధ వహించాలని కోరారు.చిన్న పిల్లలపై లైంగిక వేధింపులకు పాల్పడే వారు ఎట్టి పరిస్థితుల్లోనూ చట్టానికి తలవంచక తప్పదని స్పష్టం చేశారు. ఇందుకోసం కోర్టు ట్రయల్‌ను పకడ్బందీగా మానిటర్ చేస్తూ, నిందితులకు కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

పై కేసులో ముద్దాయికి శిక్ష పడటంలో కృషిచేసిన అప్పటి SI ప్రస్తుత ఒంగోలు టు టౌన్ సీఐ మేడా శ్రీనివాసరావు, ప్రస్తుతం ఉన్న కొత్తపట్నం SI సుధాకర్ , స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గొట్టిపాటి శ్రీనివాసరావు, కోర్ట్ లైజన్ ASI E.V. స్వామి, కానిస్టేబుల్ M.యల్లమంద, కొత్తపట్నం కోర్టు కానిస్టేబుల్ K.ప్రసాద్ రావులను, జిల్లా ఎస్పీ గారు ప్రత్యేకంగా అభినందించారు.

4 months ago | [YT] | 0

chaithukumar

*కట్టుకున్న మనిషిని కళ్లముందే కాల్చిచంపుతుంటే, కరిగిపోతున్న నుదుటి కుంకుమ కన్నీళ్లను ఎర్రబారుస్తుంటే మ్రాన్పడిన గుండెలతో నేలపై కూలబడిన ఆడబిడ్డల శోకానికి భారతావని బదులు తీర్చుకుంది. భార్యాబిడ్డల కళ్లముందే అమాయకుల తలల్లోకి తుపాకీ గుళ్లు దించిన నరరూప రాక్షసులను 'స్వాతంత్ర్య సమరయోధులు'గా కీర్తించిన దానవ దాయాది దేశానికి దానికి అర్థమయ్యే భాషలోనే ధీరభారతం జవాబిచ్చింది. సుందర కశ్మీరాన్ని భరతమాత నొసటన నెత్తుటి సిందూరంగా మార్చిన సీమాంతర ఉగ్రవాదాన్ని అంతం చేయాల్సిందేనని 140కోట్ల గొంతులు ఏకస్వరంతో నినదిస్తున్నాయి. పాకిస్థాన్ ప్రాపకంలోని పిశాచగణాలపై ఆసేతుహిమాచలం ఎగసిపడుతున్న ఆగ్రహజ్వాలలనే మందుగుండ్లుగా మార్చి సరిహద్దులకు ఆవలి ఉగ్రవాద శిక్షణ శిబిరాలపై మన త్రివిధ దళాలు ప్రళయ భీకరంగా దండెత్తాయి. పహల్గాం పైశాచికకాండలో ప్రాణాలొదిలిన పర్యాటకులకు 'ఆపరేషన్ సిందూర్'తో భారత ప్రభుత్వం, సాయుధ బలగాలు ఘనంగా నివాళి అర్పించాయి.*

7 months ago | [YT] | 0

chaithukumar

*"ప్రజా సమస్యల పరిష్కార వేదిక" (పిజిఆర్ఎస్) కార్యక్రమాన్ని నిర్వహించిన బాపట్ల జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఐపీఎస్*
*అర్జీలు పునరావృతం కాకుండా శాశ్వత పరిష్కారం చూపాలి*

8 months ago | [YT] | 1

chaithukumar

*జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఐపీఎస్ ఆదేశాలతో స్పెషల్ డ్రైవ్ నిర్వహించి విస్తృతంగా వాహన తనిఖీలు చేసిన జిల్లా పోలీసులు*

*జిల్లాలోని 31 ముఖ్యమైన ప్రదేశాలలో 3799 వాహనాలను తనిఖీ చేసిన పోలీసులు*

*సరైన ధ్రువీకరణ పత్రాలు లేని 136 వాహనాలు సీజ్*

*14 మందిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు*

*268 వాహనాలకు చలానాలు విధించడం జరిగింది*

*అక్రమ రవాణా, నేరాల నియంత్రణ లక్ష్యంగా వాహన తనిఖీలు*

*వాహనదారులు ప్రతి ఒక్కరు సరైన ధ్రువీకరణ పత్రాలు కలిగి ఉండాలి*

*జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఐపీఎస్*

8 months ago | [YT] | 2

chaithukumar

*బాపట్ల జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం, ప్రెస్ నోట్, తేది:15.09.2024.*

*"ప్రజా సమస్యల పరిష్కార వేదిక" కార్యక్రమం తాత్కాలికంగా రద్దు*

ప్రతి సోమవారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో నిర్వహించే "ప్రజా సమస్యల పరిష్కార వేదిక" కార్యక్రమాన్ని సెప్టెంబర్ 16న సోమవారం "మిలాద్ ఉన్ నబీ" పండుగ సందర్భంగా తాత్కాలికంగా రద్దు చేయడం జరిగిందని జిల్లా ఎస్పీ శ్రీ తుషార్ డూడి ఐపీఎస్ గారు ఒక ప్రకటనలో తెలిపినారు. దూరప్రాంతాల నుండి ఫిర్యాదులు ఇవ్వడానికి జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయానికి రాదలచిన ప్రజలు ఈ విషయాన్ని గమనించవలసిందిగా సూచించారు.

1 year ago | [YT] | 2

chaithukumar

*గతంలో పేరలి గ్రామంలో జరిగిన హత్య కేసులోని నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష*

*నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష పడడం పట్ల హర్షం వ్యక్తం చేసిన మృతుడి తల్లిదండ్రులు*

*జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందాల్ ఐపీఎస్ గారిని ప్రత్యేకంగా కలిసి దుశాలువతో ఘనంగా సన్మానించిన బాధితులు*

2 years ago | [YT] | 3

chaithukumar

*జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో "స్పందన" కార్యక్రమం నిర్వహించిన జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందాల్ ఐపీఎస్ గారు.*

2 years ago | [YT] | 6

chaithukumar

*జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు "నో యాక్సిడెంట్ డే" కార్యక్రమాన్ని సమర్ధవంతంగా నిర్వహిస్తున్న పోలీస్ అధికారులు*

2 years ago | [YT] | 6

chaithukumar

*బాపట్ల జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందాల్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం లో స్పందన కార్యక్రమం నిర్వహించిన అడిషనల్ ఎస్పీ పి. మహేష్ గారు*

2 years ago | [YT] | 0

chaithukumar

*బాపట్ల జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందాల్, ఐపిఎస్., గారి ఆదేశాల మేరకు వెదుళ్ళపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహించిన బాపట్ల సబ్ డివిజన్ పోలీసులు.*

2 years ago | [YT] | 2